'ఏక్ ' బాదుడు
భావరాజు పద్మిని
(ఒకరు కనిపెట్టిన ఒక ప్రక్రియ విజయవంతం కాగానే అంతా దాన్నే అనుకరిస్తారు. ఒకరు కనిపెట్టిందే పట్టుకు రాస్తుంటే, ఇక కొత్తగా సృష్టించేది ఏముంటుంది చెప్పండి ? అందుకే... ఏక వాక్య కవితలు... దీనిపై సరదాగా... ఒక పారడీ. )ఆకాశానికి జలుబు చేసింది, వానగా దాని ముక్కు కారింది.
మంచుకు చలేసింది, చెరువులో దూకి ఆత్మహత్య చేసుకుంది.
మబ్బులకి ఆకలేసిందేమో, చంద్రుడిని కొరుక్కుతిన్నట్టున్నాయి.
ఏషియన్ పెయింట్ డబ్బాలు ఒంపేసారేమో, అంబరం వర్ణరంజితమయ్యింది.
ఉరుముకు కోపం వచ్చినట్లుంది, దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తోంది.
(హమ్మయ్య, పాంచ్ పటాకా అయిపోయింది, మళ్ళీ తర్వాత రాస్తానే ... రెప్ప వెయ్యకుండా చూస్తూ ఉండండి.)
No comments:
Post a Comment